ఓ రైల్వే ఉద్యోగి ఏకంగా రైల్వే బుకింగ్ కార్యాలయం ముందు సిట్టింగ్ వేశాడు. ఫుల్లుగా తప్ప తాగి బుకింగ్ కార్యాలయం ముందే అడ్డంగా పడిపోయాడు. టికెట్స్ కొనేందుకు వచ్చి పోయే ప్రయాణికులు , మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి కోట రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న గుత్తి కోట రైల్వే స్టేషన్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం ధర్మవరం- మచిలీపట్నం రైలు మాత్రమే రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ఇదే అదునుగా కొత్తగా ఏర్పాటు అయిన ఈ స్టేషన్ మందుబాబులకు అడ్డాగా మార్చుకున్నారు. బయట వారే తాగి తందనాలు ఆడగా లేనిది రైల్వే ఉద్యోగినైన నేను తాగకూడద అనుకున్నాడు ఏమో…? ఈ గ్యాంగ్ మాన్ చంద్రగిరి లోకేష్ ఏకంగా బుకింగ్ ఆఫీస్ ఎదుట ఇలా సిట్టింగ్ వేశాడు. మందు ,విందు సెటప్ చేసుకున్నాడు. ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం , గ్లాస్ లో పోసుకున్న మద్యం పూర్తి చేయకుండానే ఓవైపుకి ఇలా వాలిపోయాడు. టికెట్స్ కొనేందుకు వచ్చి పోయే ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని సిబ్బందితో పాటు అక్కడికి వచ్చిన పలువురు సూచించినప్పటికీ…పుష్పా సినిమాలో అల్లుఅర్జున్ ఈ కాలు నాదే ఈకాలు నాదే నాకాలుపైన నా కాలు వేసుకుంటి ఏం ఓనర్ మీద ఏస్తినా…ఏందీ అన్నరేంజ్ లో కాలు మీద కాలు వేసుకొని ఎవరికైనా చెప్పుకోండి ఆఫీసులో వెళ్లి నాపై కంప్లైంట్ చేసుకోండంటూ కాలు మీద కాలు వేసుకుని ఫోజ్ ఇచ్చాడు. ఎట్టకేలకు విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో తోటి సిబ్బంది వచ్చి అతను అక్కడి నుంచి తీసుకెళ్లారు. మందుబాబులకు అడ్డాగా మారిన ఈ రైల్వే స్టేషన్ లో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుచున్నారు.