- రేషన్ డీలర్లే మాఫియా డాన్ల్ గా అవతారమెత్తారు..
- MDU ఆపరేటర్లతోనే,నేరుగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేపిస్తున్న భడా బాబులు..
- అర్హులైన వారికి ఇంటివద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాల ద్వారానే అక్రమ వ్యాపారం..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం: ప్రభుత్వం నెల నెలా ఉచితంగా పేదవారికి ఇచ్చే రేషన్ బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా.. వారికి కేజీ బియ్యాన్ని రూ.10 నుంచి రూ.13 వరకు ఆశ చూపించి వీళ్ళే వేలి ముద్ర వేయించుకుని రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు..
వైఎస్సార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాన్ని తప్పుదారి పట్టిస్తున్న MDU ఆపరేటర్లు, రేషన్ డీలర్లు…
రేషన్ మాఫియా డాన్ లకు కొమ్ము కాస్తూ, స్వయంగా వీళ్ళే పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేసి అధికారులకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా రేషన్ షాపు లోనే బియ్యాన్ని నిల్వ ఉంచి నేరుగా రేషన్ ఢాన్ లకు అమ్ముకుంటున్నారని అర్హులైన పేదవారు ఆరోపిస్తున్నారు..
వీళ్ళే కొన్న రేషన్ బియ్యాన్ని పది ఇళ్ళల్లో ఉంచి సాయంత్రం పూట టీవీఎస్, బైక్ ల మీద మూటలు పెట్టుకుని నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు…
మిల్లుల యజమానులు రేషన్ బియ్యాన్ని నూకలా మార్చి కోళ్ల ఫారాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు..
నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మరియు విజయవాడ రూరల్ లలో ఇంత తరహా రేషన్ మాఫియా జరుగుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించడం లో అర్దం ఏమిటి అంటున్న ప్రజలు..
వైఎస్సార్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇంటి వద్దకే నిత్యవసర సరుకులు పంపిణీ పథకాన్ని, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల రాబోయే ఎన్నికల్లో , వైఎస్సార్ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదనడంలో సందేహమే లేదు..
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల్లో ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా ఒకటి, ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వల్ల అన్ని సంక్షేమ ఫలాలకు చెడ్డ పేరు వస్తుందని ప్రజలు కొందరు చెప్పుకుంటున్నారు..
ఈమధ్య మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తరచూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. జిల్లా కలెక్టర్ కు కూడా…ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం మచ్చగానే మిగులుతుంది, కాబట్టి ఇకనైనా కలెక్టర్ గారు స్పందించి కింది అధికారులకు తగు సూచనలు ఇచ్చి ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని ఆపవలసిందిగా, అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు..