
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య .. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు విచారణలో ఒంగోలు పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు అనుమానితులను గుంటూరు జిల్లా పొన్నూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో కేసు దర్యాప్తులో ముందడుగు పడినట్లయింది.