జనవరి నెలాఖరు వరకు విదేశాల నుంచి మొత్తం 40వేల మెట్రిక్ టన్నుల ఉల్లి వస్తుందని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వివరించారు. ముంబై నగరంలో ఉల్లి కిలో ధర రూ.49 నుంచి 58 రూపాయల దాకా ఉందని మంత్రి చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముందుగా 33, 139 మెట్రిక్ టన్నుల విదేశీ ఉల్లి కావాలని ఆర్డరు చేసి దాన్ని 14, 309 మెట్రిక్ టన్నులకు తగ్గించిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉల్లి సీజన్ ముగియడంతో ఉల్లి ధరలు పెరిగాయని, లక్ష మిలియన్ టన్నుల ఉల్లి డిమాండు ఉందని మంత్రి చెప్పారు. విదేశాల నుంచి ఉల్లి నిల్వలు రావడంతో దేశంలో వీటి ధరలు తగ్గాయని మంత్రి వివరించారు.కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ రాష్ట్రాలకు శుభవార్త చెప్పారు. దేశంలో ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని ఆయా రాష్ట్రాలు డిమాండును బట్టి ఆర్డరు చేస్తే పంపిస్తామని కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మంగళవారం ప్రకటించారు.విదేశాల నుంచి ఇప్పటికే 12,000 మెట్రిక్ టన్నుల ఉల్లి వచ్చిందని, వీటిని రాష్ట్రాలకు పంపిస్తున్నామని మంత్రి చెప్పారు
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference