‘ఇది దారుణమైన బడ్జెట్. దూరదృష్టి లేని కురచ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటం దరిద్రం. బడ్జెట్లో రైతులు, పంటలకు కనీస గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు. పైగా రూ.12,708 కోట్ల యూరియా సబ్సిడీ, రూ.22192 కోట్ల ఇతర ఎరువుల సబ్సిడీలు కలిపి మొత్తం రూ.34,900 కోట్ల సబ్సిడీలను తగ్గించారు. 2022 నాటికి రైతుల ఆదా యం రెట్టింపు చేస్తామనే హామీ ఏమైంది? రైతు ల పరిస్థితే బాగుంటే ఏడాది పాటు ఎండావానల్లో ఆందోళన ఎందుకు చేశారు? ఓ వైపు దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతే, గ్రా మీణ ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కో ట్లు కోత పెట్టారు. కేంద్ర విద్యుత్ విధానం మెం టల్ కేస్‌లాగా ఉంది..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
దేశ ప్రజానీకం ఆయన ప్రభుత్వానికి పదేళ్ల కాలానికి తీర్పునిస్తే ఇప్పటికే 80 శాతం సమయం పూర్తయింది. 116 దేశాల ప్రపంచ హంగర్ ఇండెక్స్‌లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే భారత్ అధ్వాన్న స్థితిలో 101వ స్థానంలో ఉంది. అయినా బడ్జెట్లో ఆహార సబ్సిడీని రూ.65 వేల కోట్లు తగ్గించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం పెద్ద బోగస్. గతంలో క్రిప్టో కరెన్సీని అనుమతించమని చెప్పి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మీద 30 శాతం పన్నులు ఎలా వేస్తారు?