కరీంనగర్ జిల్లా గన్నేరువరం ఈనెల 19న, గన్నేరువరం మండలంలో మంత్రివర్యులు కేటీఆర్ పర్యటన సంధర్బంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గన్నేరువరం మండలంలోని ప్రజాప్రతినిధులు మరియు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ సమావేశం నిర్వహించారు ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్ రావు,గుడెల్లి తిరుపతి,తెరాస మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి , మండల తెరాస మహిళ అధ్యక్షరాలు కుసుంబ నవీన,ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షుడు గుడెల్లి ఆంజనేయులు,సర్పంచ్ కర్ర రేఖ, తదితరులు హాజరయ్యారు.