విజయవాడ : ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న హోంగార్డు సమస్యల పరిష్కారానికై చొరవ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంగార్డుల రాష్ట్ర అభివృద్ధి సంఘం అధ్యక్షుడు నైదాన రామకృష్ణ యాదవ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఆయనతో పాటు సంఘ కార్యవర్గ సభ్యులు కలిసి ప్రభుత్వ ముఖ్య సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళాముపల్లి శ్రీనివాసు, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డిలను కలిసి శు క్రవారం వినతి పత్రం అందజేశారు. అలాగే ఎన్జీవోస్ అధ్యక్షులు, రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రంతో పాటు జ్ఞాపకను అందజేసి, అతనిని హెమ్ గార్డ్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్కరించారు. హోం గార్డ్స్ రాష్ట్ర అధ్యక్షులు రామ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ హోంగార్డ్ల్ సమస్యలు పరిష్కారానికి వారంతా కృషి చేస్తామని హామీ ఇచ్చరాని రాష్ట్ర హోంగార్డ్స్ సంఘం సభ్యులు తెలిపారు .