వికారాబాద్- పెద్దేముల్: లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు ఎస్‌ఐ పట్టుపడ్డాడు. ఇసుక రవాణా విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో (ఎంపిటిసి) శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎసిబి అధికారులు పథకం ప్రకారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంబాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి శ్రీనివాస్ ఇసుక రవాణా చేసుకోవాలంటే ఎస్‌ఐ చంద్రశేఖర్ రూ.50,000 డబ్బులు డిమాండ్ చేశాడు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా రూ.20 వేలు అడ్వాన్సుగా చెల్లించాడు. మిగితా రూ.30 ,000 కూడా ఇవ్వాల్సిందిగా ఎస్‌ఐ చంద్రశేఖర్ సదరు ఎంపిటిసిని ఇబ్బంది పెట్టాడు. దీంతో ఎసిబి అధికారులను ఆశ్రయించిన శ్రీనివాస్ మంగళవారం పోలీస్ స్టేషన్‌లో రూ.30,000 లంచం ఇస్తుండగా.. పథకం ప్రకారం వచ్చిన ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎస్‌ఐ ఛాంబర్ తోపాటు అతని నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది