కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రం మరియు ఖాసీంపెట్ గ్రామంలో లయన్స్ క్లబ్ గ్రామపంచాయతీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి ,పుల్లెల లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు గన్నేరువరం సర్పంచ్ పుల్లెల లక్ష్మి , ఖాసీంపెట్ సర్పంచ్ గంప మల్లేశ్వరి,వైస్ ఎంపీపీ న్యాత స్వప్న,ఎంపీటీసీ బొడ్డు పుష్పలత మరియు వార్డు మెంబర్లు నక్క వర్షిని,చింతల నవ్య, బొడ్డు పుష్పలత, బూర రాజమణి న్యాత లత, పాలెపు శ్రావణి,కో ఆప్షన్ ,తేల కవిత టీచర్ అంగన్వాడి ఆశ వర్కర్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్ ఐ మల్లయ్య గౌడ్, మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు పుల్లెల లక్ష్మణ్ రీజన్ జిఎంటి కోఆర్డినేటర్ గంప వెంకన్న, నాయకులు లయన్ న్యాత సుధాకర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి అభివృద్ధి కృషి చేస్తున్నారని వారిని ఈ సందర్భంగా కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు వార్డు సభ్యులు నరసింహారెడ్డి భూపతి,రాజు, దామోదర్, జీవన్,అనిల్,లయన్ సభ్యులు భూర శ్రీనివాస్, బొడ్డు సునీల్, బోయిన అంజయ్య,తిప్పారం శ్రీనివాస్,తెల్ల భాస్కర్, బుర రామకృష్ణ మరియు గన్నేరువరం, ఖాసీంపెట్ ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, బద్దం సంపత్ రెడ్డి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు