గాల్వాన్ లోయవద్ద భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరో జవాను వీరమరణం పొందాడు. ఈ ఘటనలో ఇప్పటికే 20 మంది అమరులైన సంగతి తెలిసిందే . తాజాగా .. మహారాష్ట్రలోని మాలెగావ్ తాలూకాలోని సాకూరి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే వీరమరణం పొందినట్టు సైనిక వర్గాలు తెలిపాయి . నాటి ఘటనలో నదిలో పడిపోయిన ఇద్దరు సైనికులను కాపాడే ప్రయత్నంలో విక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయని , ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచినట్టు సమాచారం .
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)