ప్రజలకు మృతురాలిని గుర్తించుటకు సహకరించగలరని మనవి.
కరీంనగర్: ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో జగిత్యాల వైపు వెళ్ళు దారిలో కరీంనగర్ కోర్టు కాంపౌండ్ వాల్ కి ఆనుకొని ఉన్న బస్ స్టాప్ వెనకాల గల డ్రైనేజీ గుంతలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించబడింది. ఈ విషయం తెలిసిన వెంటనే టూటౌన్ పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అట్టి మహిళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి/వ్యక్తులు మెడకు చున్నీ బిగించి హత్య చేసి సంఘటన స్థలానికి తీసుకువచ్చి డ్రైనేజీలో పడేసినట్లు అనిపిస్తుంది.
మృతదేహం గుర్తించుటకు వివరాలు:
మహిళ వయస్సు 35-40 సంవత్సరాలు, చామనచాయ శరీర రంగు, ఎత్తు 5 ఫీట్లు, దుస్తులు: కుర్తా పైజమా- రాణి కలర్(ముదురు పింక్) కుర్తా, నీలి రంగు పై గుండ్రని డిజైన్లు కల పైజమా, మెడలో పసుపు తాడులో ఎరుపు, నలుపు పూసలు ఒక పుస్తె లో ఏసుక్రీస్తు సిలువ డిజైన్ కలదు, కాళ్లకు పట్టగొలుసులు ఉన్నాయి. ఎడమ చేతికి స్టీలు గాజులు, చెవులకు స్టీలు చెవి కమ్మలు, ఎడమ చేతి పై మ్యూజిక్ సింబల్ గల టాటూ(పచ్చబొట్టు) ఉన్నది.
మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీసువారికి తెలియజేయగలరు. తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి తగిన పారితోషికం ఇవ్వబడును.
ఈ మెసేజ్ ని అందరికి షేర్ చేసి పోలీస్ వారికి మహిళా మృతదేహం గుర్తించుటకు సహకరించగలరు.
వివరాలు తెలపవలసిన ఫోన్ నెంబర్లు.
1.ఇన్స్పెక్టర్ టూ టౌన్: 9440795107
2. ACP కరీంనగర్ టౌన్: 9440795111
3.డయల్ 100.