హైదరాబాద్: మార్చి21,(మాదాపూర్) దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె శ్రీమతి శ్రీ సురభి వాణి దేవి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలుపొందిన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచం ఇచ్చి హార్ధిక అభినందనలు విజయోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి దివ్య ఆశీస్సులతో సురభివాణి దేవి ఎమ్మెల్సీ గా విజయం సాధించడం పట్ల పీవీ నరసింహారావు జన్మించిన వంగర, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పివి అభిమానులు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తూ టీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కి గెలిపించిన గ్రాడ్యువేట్స్ కి రాజు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ నేత, పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ పిడిశెట్టి రాజు,సీనియర్ జర్నలిస్ట్ ఉప్పు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.