నెల్లూరు జిల్లా: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు గారిచే విశ్వవిద్యాలయం నందు ఏర్పాటు చేయబడిన వనరుల సమీకరణ కేంద్రానికి (RESOURCE MOBILISATION CENTRE) చెందిన బ్రోచర్ ను కలెక్టర్ చాంబర్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు గారు, వనరుల సమీకరణ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరియు ఈ కేంద్రం ద్వారా చేయబోతున్న ప్రణాళికను జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్ పి శ్రీ బాస్కర్ భూషణ్ గారికి వివరించారు. నూతన విశ్వవిద్యాలయలకు ఇటు వంటి కేంద్రాల అవసరం ఎంతైన ఉంది అని తెలుపుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారు విశ్వవిద్యాలయ అధికారులను మరియు వనరుల సమీకరణ కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ ఆర్ .మధుమతి గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సుదర్శన రావు గారు, రెక్టర్ ఆచార్య యం.చంద్రయ్య గారు, సచివులు డాక్టర్ ఎల్ విజయ క్రిష్ణ రెడ్డి గారు, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్ గారు మరియు వనరుల సమీకరణ కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ ఆర్ మధుమతి గారు పాల్గొన్నారు.
