contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జిల్లా జాయింట్ కలెక్టర్ చేతులమీదుగా కరోనా నియంత్రణ చర్యల పోస్టర్ ఆవిష్కరణ

కరోనా అంటువ్యాధి. ఇది ఏ తప్పు చేస్తేనో వచ్చేది కాదు, ఇది పూర్తిగా వ్యాధి సోకిన వ్యక్తి నుండి  లేక  వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకొనటం ద్వారా ఒకరిని నుంచి ఒకరికి వ్యాపిస్తుందని సామాజిక దూరం పాటించకపోవడం, కరచాలనాలు చేయడం, మాస్క్ ధరించకపోవడం వల్లన ఈ వ్యాధి సోకుతోందని  జిల్లా జాయింట్ కలెక్టర్ డా. యన్ ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేశారు.  వి ఎస్ యు   యన్ యస్ యస్  వారు చేసిన పోస్టర్స్నును జాయింట్ కలెక్టర్ గారి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు సుమారు  నూటికి 50 నుంచి 60  శాతం మందిలో రోగ లక్షణాలు  బయటపడవు . కావున, మనము, మన కుటుంబసభ్యులు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే, పోస్టర్ లో పేర్కొన్న మూడు ముఖ్యమైన పద్దతులను మన దైనిక  జీవితం లో ఒక భాగంగా అలవాటు చేసుకోవటమే ఉత్తమమైమన మార్గం అని ఆయన సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే మనతో  పాటు మన కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యెస్.రాజ్యలక్ష్మి గారు , జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం గారు , యన్ యస్ యస్ వాలంటీర్స్ పార్థసారధి, రాజేష్ తధితరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :