పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా నల్లమోతు భారతి నామినేషన్ వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా భారతిని ‘జనసేన’ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అభినందించారు. జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలైన 70 సంవత్సరాలు ఉన్న భారతి ఎన్నికల బరిలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా శ్రీమతి నల్లమోతు భారతి గారు నామినేషన్ వేశారు. 70 ఏళ్ల భారతి గారు జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలై బరిలో నిలిచారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆమెను అభినందించారు pic.twitter.com/GrtrS55H75
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2020