contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నదిలో తేలిన ఆర్మీ జవాన్ శవం – కోటపల్లి సిఐ పై ఆరోపణలు

 

మంచిరియల్ జిల్లా చెన్నూర్ గ్రామానికి చెందిన  ఆర్మీ జవాన్ గుండవెన రాజ్ కుమార్ నదిలో శవమై తేలిన ఘటన సంచలనం సృష్టిస్తుంది .  జమ్ము కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్  ఈ నెల 13 న  సెలువుల మీద  సాయంత్రం 3:50 నిమిషాలకు సొంతూరుకు చేరుకున్నాడు,  సోమవారం  14 వ తేదీన జర్నీ  చేసి  అలసి పోయి నిద్రిస్తున్న రాజ్ కుమార్ ను  ఉదయం 11:00   సమయంలో బండి శ్రీనివాస్   కాల్ చేసి బయటికి పోదాం రమ్మని పిలిచాడు .  రాను అని రాజు కుమార్ సమాధానం ఇచ్చాడని .. అయినా కానీ  మరల మరల  కాల్  చేశాడు..  రాజు కుమార్ లిఫ్ట్ చేయలేదు.  రాజు కుమార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని  ఇంటి ముందు నివాసముంటున్న  అమ్మాయికి కాల్ చేసి కుమార్ ఇవ్వమనగా  అమ్మాయి రాజ్ కుమార్ కు ఫోన్  ఇచ్చింది అయినా కానీ  టైడ్ అయ్యాను బయటికి రాను  అని చెప్పడం జరిగింది . అయినా కానీ వినకుండా బండి శ్రీనివాస్ మరొక వ్యక్తి   బైక్ మీద వచ్చి తీసుకెళ్లారు…  ఆ మరునాడు ఎర్రాయిపేట వద్ద నదిలో శవమై తేలాడాడు . శవమై తేలిన రాజ్ కుమార్ వంటి పై గాయాలు ఉన్నాయని , శవం కూడా ఉబ్బలేదని , స్విమ్మింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన రాజ్ కుమార్ ఎంతో కొంత తనని తాను రక్షించుకోగలడని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటింబీకులు .  ఈ విషయం పై కోటపల్లి సిఐ నాగరాజు సరిగా దర్యాప్తు చేయడం లేదని బాధిత కుటుంబ సభ్యులు  బలంగా ఆరోపిస్తున్నారు. 

సెలవులో వచ్చిన ఆర్మీ జవాన్ చనిపోతే ముందుగా ఆర్మీ అధికారులకు పోలీసువారు తెలిపాలి. పోస్ట్ మార్టం ముందు చేసినా .. లేక వారు వచ్చాక పోస్టుమార్టం  చేసిన తరువాత..  బాడీ ని ఆర్మీ అధికారులకు అప్పజెప్పాలి .ఆర్మీ అధికారులు రాజ్ కుమార్   కుటుంబ సభ్యులకు బాడీ ని  అప్పజెప్తూ ఏమైనా అనుమానాలు ఉంటె తెలుసుకొని మరల రీ  పోస్టుమార్టం కి పంపి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏమైనా అనుమానాలు ఉంటే సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తారు .   ఇటువంటివి ఏమి జరగకుండా మంచిర్యాల జిల్లా పోలీసులు మౌనం గా ఉన్నారంటే పలు అనుమానాలకు తావిస్తుంది . 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :