కరీంనగర్ జిల్లా ది రిపోర్టర్ టీవీ న్యూస్ : నిల్వ నీడలేక, ఉండడానికి గూడు లేక వీధిన పడ్డ ఓ నిరుపేద దళిత కుటుంబానికి కొండంత అండగా నిలిచాడు మనసున్న మారాజు మన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన అంతడ్పుల మధునయ్య-లచ్చమ్మ అనే దంపతులు కూలీనాలీ చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఉండడానికి ఇళ్ళు లేకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతో ఓ పూరి గుడిసెలో తలదాచుకుంటున్నారు.
గత 4 సంవత్సరాల క్రితం గ్రామ సందర్శన కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లిలోని దళిత కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే రసమయి మధునయ్య కుటుంబ దీన గాథను కళ్లారా చూసి చలించిపోయి, వెంటనే తన సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించి వారికి కానుకగా ఇచ్చారు.
ఇటీవల మధునయ్య-లచ్చమ్మ కూతురు మమత వివాహం జరుగగా ఈరోజు రసమయి స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఒక లక్షా 16 వేళా రూపాయల కళ్యాణాలక్ష్మి చెక్కును అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు.
దీంతో మాఇంటి దేవుడు మీరేనయ్యా..మీకు జీవితాంతం రుణపడి ఉంటామయ్యా.. నాడు ఇళ్లు కట్టించి మాకు నీడయ్యారు.. నేడు నాబిడ్డ పెళ్లికి కళ్యాణాలక్ష్మి చెక్కు ఇచ్చి ఆసరాగా నిలిచారు అంటూ ఎమ్మెల్యే రసమయి కి మధునయ్య కుటుంబ సభ్యులు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.