కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామం చొక్కల్లపల్లి వద్ద శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద ఎమ్మెల్యే నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాక్స్ లైటు ను స్థానిక ఎంపిటిసి, గన్నేరువరం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు ప్రారంభోత్సవం చేశారు. మరో పది రోజుల్లో పెద్దమ్మతల్లి జాతర ఉన్నందున ఐమాక్స్ లైటు ను ఏర్పాటు చేయాలని ముదిరాజ్ కులస్తుల విజ్ఞాపన మేరకు ఈ లైటును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మానకొండూరు శాసనసభ్యులు, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ శ్రీ రసమయి బాలకిషన్ గారికి గన్నేరువరం జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డికి మరియు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గూడెల్లి తిరుపతి కి ముదిరాజ్ కులస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు న్యాలపట్ల శంకర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ హన్మాండ్ల యాదగిరి, ముదిరాజు కులస్తుల పెద్ద మనుషులు గూడెల్లి రాములు చొక్కల కొండయ్య, గూడెల్లి మల్లేశం, చొక్కల తిరుపతి, చొక్కల శ్రీనివాస్, చొక్కల రాజలింగం, గుడెల్లి లక్ష్మయ్య చొక్కల బుచ్చయ్య, చొక్కల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.









