అమెరికాకు చెందిన వాణిజ్య, అమెరికా ప్యాసెంజర్ విమానాలు పాకిస్థాన్ గగనతలం ఉపయోగించొద్దని స్పష్టంచేసింది. పొరపాటున పాకిస్థాన్ గగనతలం ఉపయోగిస్తే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు, అతివాదుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. పాకిస్థాన్ గగనతలాన్ని పొరపాటున కూడా ఉపయోగించొద్దని జనవరి 1వ తేదీన ఆదేశాలు జారీచేసింది. అమెరికాకు చెందిన అన్ని వాణిజ్య, ప్యాసెంజర్ విమానాలకు ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నది. అమెరికా పౌరవిమానయాన సంస్థ అనుమతి ఇచ్చిన అన్ని విమానాలకు ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అమెరికాకు వచ్చే విదేశాలకు చెందిన విమానాలకు మాత్రం ఆదేశించలేమని తెలిపింది. ఒకవేళ పాకిస్థాన్ గగనతలం ఉపయోగించిన సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్న ఫలితం ఉండబొదని చెప్పారు. తక్కువ ఎత్తులో ప్రయాణించిన సమయంలో గానీ, విమానం దిగే సమయంలో గానీ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి అమెరికాకు ముప్పు ఉందని. చిన్న ఆయుధాల నుంచి ఎయిర్ పోర్టులలో దాడుల చేసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference