contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాలనపై దృష్టిపెట్టిన రేవంత్ అండ్ టీం .. పరిష్కారం దిశగా అడుగులు !

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పరిపాలనపై దృష్టి పెట్టింది. ఓవరాల్‌గా అన్ని ఇష్యూస్‌ మీద సీఎం రేవంత్‌ రివ్యూలు చేస్తుంటే.. తమతమ శాఖలపై మంత్రులు సమీక్షలు మొదలెట్టారు. ఆయా శాఖల్లో పరిస్థితులపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. తమతమ పరిధిలోని శాఖలపై పట్టు సాధించేందుకు.. వరుసబెట్టి సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే విద్యుత్‌ శాఖపై వరుసగా రెండ్రోజుల పాటు సమీక్ష చేసిన సీఎం రేవంత్‌.. నిన్న గ్రేటర్‌ హైదరాబాద్‌పై రివ్యూ చేశారు. మూసీ ప్రక్షాళన, నది పరిసరాల్లో అక్రమనిర్మాణాలు.. తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలూ హాజరయ్యారు.

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై ఫోకస్‌ పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ అంశంపై ఉదయం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పోటీ పరీక్షల తేదీలను రీషెడ్యూల్‌ చేయాలని యోచిస్తున్న సీఎం.. ఈనెల 17న తెలంగాణ జెన్‌కో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే గ్రూప్‌-2 పరీక్ష రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి అనుగుణంగా.. జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరోవైపు, సివిల్‌ సప్లైస్ శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్‌కార్డుల జారీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సివిల్ సప్లైస్ శాఖను గత పాలకులు అస్తవ్యస్తం చేశారన్న ఉత్తమ్‌.. చాలా రుణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 12% మంది వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించడం లేదన్న మంత్రి.. అర్హులైన వారికి కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు కసరత్తు చేస్తున్నామన్నారు.

అటు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రివ్యూ చేశారు. మంచి దిగుబడి వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మార్కెట్‌ యార్డుల స్థితిగతులపై పూర్తివివరాలను అందించాలని ఆదేశించారు. మొత్తానికి, వరుస సమీక్షలతో అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు.. పాలనను ట్రాక్‌ ఎక్కించే పనిలో పడ్డారన్నమాట.

అటు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రివ్యూ చేశారు. మంచి దిగుబడి వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మార్కెట్‌ యార్డుల స్థితిగతులపై పూర్తివివరాలను అందించాలని ఆదేశించారు. మొత్తానికి, వరుస సమీక్షలతో అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు.. పాలనను ట్రాక్‌ ఎక్కించే పనిలో పడ్డారన్నమాట.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :