సోమవారం రోజు ఎస్పి కార్యాలయం లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఎస్పి సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ R/O గుత్తి కోయ గుంపు, తిప్పాపురం గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన వెట్టి ఐతు అలియాస్ ఐతడు(23), S/O లక్ష్మ , ఆగస్ట్ 2014 స౦!!లో చర్ల మావోయిస్ట్ పార్టీ దళం వారి యొక్క పాటలకు సాంస్కృతిక కార్యకలాపాలకు మరియు ఉపన్యాసాలకు ఆకర్షుతుడై ఆ దళా కమాండర్ అయిన సంతోష్ ఆదేశాలు ప్రకారంగా మావోయిస్ట్ పార్టీ లో దళ సభ్యుని గా చేరి అజ్ఞాత వాసం లోనికి వెళ్లి బలహీన వర్గాలకు సేవ చేయాలని సంకల్పంతో మావోయిస్ట్ పార్టీ దళ సభ్యుని గా కొనసాగుతూ CPI మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు అయిన హరి భూషణ్, దామోదర్, వెంకటేష్, ఆజాద్, బాస్కర్ మరియు బండి ప్రకాష్ ల ఆదేశానుసారంగా పని చేస్తూ పార్టి అగ్రనేతలు వద్ద నమ్మకస్తుడి ల ఉంటూ 2016 వరకు చర్ల దళ సభ్యుడిగా పని చేస్తుండగా పార్టి ఆదేశాల మేరకు బడే చొక్కారావు @దామోదర్ స్టేట్ కమిటి మెంబర్ ఇంచార్జ్ తెలంగాణా స్టేట్ మిలిటరీ చీఫ్ కు గార్డ్ గా నియమించినారు.జూన్ 2017 స౦!!లో ట్రైనింగ్ చేస్తూ క్రింద పడిపోగా అతని వెన్నుపూసకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతూ పార్టి లో పని చేయలేక లొంగి పోదామని పార్టి అగ్రనేతలకు చెప్పుకొనగా వారు బలవంతముగా పార్టి లో కొనసాగాలని అదేశించినారుని డిసెంబర్ 2019 స౦!!లో ఏరియా కమిటి మెంబర్ గా ప్రమోషన్ ఇచ్చి అదే బడే చొక్కారావు @దామోదర్ కు గార్డ్ ప్రొటెక్షన్ టీం కమాండర్ గా పని చేస్తున్నాను అని సుమారు 3 సం!!ల నుండి వెన్నుపూస(బ్యాక్ పెయిన్) నొప్పితో బాధ పడుతూ CPI మావోయిస్ట్ పార్టి లో పని చేయలేక ఇబ్బంది పడుతున్నాను మార్చ్ నెలలో తెలంగాణా లో ఏదైనా విద్వాసంకర చర్యలు చేయాలనీ తిరిగే ప్రయత్నంలో షాపేల్లీ ఫారెస్ట్ ఏరియా కు వచ్చి ఆరోగ్యం సహకరించక ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కారోనో వైరస్ వలన తెలంగాణ ఏజెన్సీ ప్రాంతం లోని గుత్తి కోయ గుంపు లలో నివాసం ఉంటున్న గుత్తి కోయ గిరిజనలకు తెలంగాణా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిత్యవసర సరకులను గిరిజనుల వద్ద నుండి CPI మావోయిస్ట్ పార్టి వారు బలవంతముగా తీసుకోవడం మరియు CPI మావోయిస్ట్ పార్టి కి సహకరించని గిరిజనలను ఇన్ఫార్మర్ నెపం తో చంపడం పార్టి విధానాలు నచ్చక వారు పార్టి లో కొనసాగాలని బలవంతం చేయడం ఇష్టం లేక అతని అనారోగ్య కారణాలు వలన లొంగి పోవాలనే ఉద్దేశంతో అక్కడ నుండి తను బయటకు వచ్చి ఎస్.ఎస్ తాడ్వాయి మండలం లోని కామారం లో గల అతని చిన్నాయన వద్దకు వచ్చి అతని సహాయంతో పోలీసుల వద్ద నిన్న సాయింత్రం సుమారుగా 5 గంటల సమయం లో లొంగి పోయి జన జీవన స్రవంతి లో కలుస్తున్నట్టుగా చెప్పినాడని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు అలాగే ఓ ఎస్ డి ఎ ఎస్పి సాయి చైతన్య పాల్గొన్నారు.