ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఫ్రాస్ట్ సిల్వర్, స్ప్రూస్ గ్రీన్, మ్యాగ్నెట్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
టెక్నో కామోన్ 17 ప్రో ధర
ఇందులో కూడా ఒక్క వేరియంటే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని ధర రూ.16,999గా ఉంది. ఆర్కిటిక్ డౌన్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ కింద ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువైన ఫ్రీ బడ్స్1.. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను ఉచితంగా అందించనున్నారు. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు కూడా లభించనుంది. వీటికి సంబంధించిన సేల్ జులై 26వ తేదీన ప్రారంభం కానుంది.
టెక్నో కామోన్ 17 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ వీ7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది. యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మరో మూడు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. డ్యూయల్ ఫ్లాష్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.88 సెంటీమీటర్లుగా ఉంది.
టెక్నో కామోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ వీ7.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో కామోన్ 17 ప్రో పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌లు కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 48 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.89 సెంటీమీటర్లుగా ఉంది.
పెర్ఫార్మెన్స్ | MediaTek Helio G95 |
డిస్_ప్లే | 6.8 inches (17.27 cm) |
స్టోరేజ్_ఫైల్ | 256 GB |
కెమెరాా | 64 MP + 8 MP + 2 MP + 2 MP |
బ్యాటరీ | 5000 mAh |
price_in_india | 21990 |
ర్యామ్ | 8 GB |