కరీంనగర్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు యువజన విభాగం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రధానకార్యదర్శి గా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గందె రమేష్ ముదిరాజ్ ను నియమిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ ఉత్తర్వులు జారీచేసి నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ మాట్లాడుతూ బిసీ సమస్యలపై పోరాడుతూ బిసీ సంక్షేమ సంఘం బలోపేతం దిశగా పనిచేయాలని సూచించారు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత నియోజకవర్గ కన్వీనర్ అక్కు శ్రీనివాస్ యువజన విభాగం అధ్యక్షుడు కర్ణకంటి నరేష్ గందె రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు