contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బీఆర్‌ఓ–జీఆర్‌ఈఎఫ్‌లో 459 ఖాళీలు..

 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ), జనరల్‌ రిజర్వ్‌ ఇంజనీర్‌ ఫోర్స్‌ (జీఆర్‌ఈఎఫ్‌) విభాగంలో.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 459

ఖాళీల వివరాలు: డ్రాఫ్ట్స్‌మెన్‌–43, సూపర్‌వైజర్‌ స్టోర్‌–11, రేడియో మెకానిక్‌–04, ల్యాబ్‌ అసిస్టెంట్‌–01, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(మాసన్‌)–100, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(డ్రైవర్‌ ఇంజన్‌ స్టాటిక్‌)–150, స్టోర్‌ కీపర్‌(టెక్నికల్‌)–150.

అర్హతలు:

డ్రాఫ్ట్స్‌మెన్‌: సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు ఆర్కిటెక్చర్‌/డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌లో రెండేళ్ల సర్టిఫికెట్‌ కోర్సు లేదా డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌) సబ్జెక్టులో రెండేళ్ల నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌తోపాటు సంబంధిత ట్రేడులో ఏడాది ప్రాక్టికల్‌ అనుభవం ఉండాలి.

వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.

సూపర్‌వైజర్‌ స్టోర్‌: డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌/ఇన్వెంటరీ కంట్రోల్‌/స్టోర్స్‌ కీపింగ్‌ కోర్సుల్లో సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.

రేడియో మెకానిక్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇండ స్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి రేడియో మెకానిక్‌ సర్టిఫికెట్‌తోపాటు రెండేళ్లు రేడియో మెకానిక్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.

ల్యాబ్‌ అసిస్టెంట్‌: ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులవ్వాలి. ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జారీ చేసిన ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.

మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (మాసన్‌): మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణుల వ్వాలి. బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌/బ్రిక్స్‌ మాసన్‌లో ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జారీ చేసిన సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.

మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజన్‌ స్టాటిక్‌): మెట్రిక్యులేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. మెకానిక్‌ మోటార్‌/వెహికిల్స్‌ విభాగాల్లో ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జారీ చేసిన సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టోర్‌ కీపర్‌ (టెక్నికల్‌): ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వెహికిల్స్‌/ఇంజనీరింగ్‌ ఎక్విప్‌మెంట్‌కి సంబంధించిన స్టోర్‌ కీపింగ్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్‌ టెస్ట్‌(ట్రేడ్‌ టెస్ట్‌), రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా తయారుచేస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి ప్రక్రియ ఫిజికల్‌ అండ్‌ ప్రాక్టికల్‌ ట్రేడ్‌ టెస్ట్‌లకు ఎంపిక చేస్తారు. వీటిలో ప్రతిభ చూపిన వారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. మెడికల్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జీఆర్‌ఈఎఫ్‌ సెంటర్, పుణెలో ట్రెయినింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండెంట్‌ జీఆర్‌ఈఎఫ్‌ సెంటర్, డిగి క్యాంప్, పూణె–411015 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 3, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.bro.gov.in.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :