కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లె పరిధిలోని కూనవానిపల్లికి చెందిన కూన లక్ష్మణ్,కూన బాల లక్ష్మి లను గత జనవరిలో ఎస్సై ఆవుల తిరుపతి 6 నెలల వరకు శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా మండల తాహశీల్దార్ కె రమేష్ ముందు 107 CrPC క్రింద బైండోవర్ చేయడం జరిగినది పై వ్యక్తులు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి శాంతిభద్రతలకు భంగం కలిగించడం జరిగినది అట్టి వ్యక్తులపై చర్య తీసుకోవాలని ఎస్సై ఆవుల తిరుపతి తాహశీల్దార్ రమేష్ ను కోరగా 107 CrPC నిబంధనలు ఉల్లంఘించినందుకు తాహశీల్దార్ రమేష్ ఇద్దరు వ్యక్తులపై ఒక నెల జైలు శిక్ష విధించడం జరిగింది తాహశీల్దార్ ఆదేశానుసారం పోలీసులు వారిని ఈరోజు జైలు కు పంపించడం జరిగింది ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ బైండోవర్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు