కరీంనగర్ జిల్లా: సాయుధ పోరాటంలో ఆంగ్లేయులకు కంటి మీద కునుకు లేకుండా చేసి, బ్రిటిష్ పాలకులకు వణుకు పుట్టించిన ధీరుడు, అజాద్ హింద్ ఫౌజ్ స్ధాపించి బ్రిటిష్ వారి గుండెల్లో మించిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణ రెడ్డి కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పరాక్రమ దివస్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని సుభాష్ నగర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తీవ్రంగా కృషి చేసి బ్రిటిషర్ల తో పోరాడారని తెలిపారు. అలాంటి పోరాటంలో ఎందరో తెరమరుగు కొందరు కనుమరుగయ్యారు అని ఇందులో ఎవరికి కూడా బ్రిటిషర్లకు తలవంచని విధంగా పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముందువరుసలో ఉంటారని తెలిపారు. బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుండి భరతమాతకు విముక్తి కలగాలంటే అహింస ఒక్కటే సరిపోదని, సాయుధ పోరాటం కూడా అవసరమని అని బలంగా నమ్మిన అతివాదుల లో నేతాజీ తొలి వ్యక్తి అని తెలిపారు. బ్రిటిష్ పాలకుల్లో వణుకు పుట్టించిన అసామాన్య దీరుడు గా చరిత్రకెక్కిన సుభాష్ చంద్ర బోస్ జయంతి 23 ని కేంద్రం పరాక్రమ దివస్ గా ప్రకటించి ఆయనను స్మరించుకునేలా చేసిందని అన్నారు. వీరుడిగా భారత స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు వెలకట్ట లేనివని కొనియాడారు ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని,ఆయన బాటలో బిజెపి నాయకులు కార్యకర్తలు నడవాలని సూచించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గం అనుసరణీయం అని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవడానికి కృషి చేయాలని కోరారు.. తదనంతరం జిల్లా పార్లమెంటు కార్యాలయంలో బిజెపి జిల్లా శాఖ మరియు బిజెపి ఎక్స్ సర్వీస్ మెన్ కన్వీనర్ ములుగురి రవి ఆధ్వర్యంలో మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సైనికులు ఎలగందుల శ్రీధర్, మహమ్మద్ ఇక్బాల్, ముద్దసాని సుధాకర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి శంకర్, బిజెపి నాయకులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి సంపత్ రావు,బోయినపల్లి ప్రవీణ్ రావు, బొంతల కళ్యాణ్ చంద్ర, మర్రి సతీష్ కుమార్, కటకం లోకేష్, నాగసముద్రం ప్రవీణ్, నరహరి లక్ష్మారెడ్డి, దురిశెట్టి సంపత్, మాడుగుల ప్రవీణ్ , మంజుల వాణి, కార్పొరేటర్లు కొలగని శ్రీనివాస్, కాసర్ల ఆనంద్ ,అనూప్ తదితరులు పాల్గొన్నారు