తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిపార్ట్మెంట్లో తాత్కాలిక ప్రాతిపాదికన ఉద్యోగులను నియమించేందుకు ప్రకటన విడుదలైంది. ప్రత్యేక పోలీసు అధికారుల (SPO) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 1,750 పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.మాజీ సైనికులను ప్రత్యేక పోలీసు అధికారులను ప్రత్యేకంగా నియమించనుంది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 9 నెలల కాలానికి నెలకు రూ.20వేలను గౌరవ వేతనం ఇవ్వనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1450, రాచకొండ 150, సైబరాబాద్ 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.