contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతు వేదికని ప్రారంభించిన మంత్రులు

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో శనివారం నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ  ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం  రైతు వేదిక నిర్మాణాలను ప్రారంభించిన  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్., ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ రైతు వేదికలు ఆయా గ్రామాలకు దేవాలయాలని, భవిష్యత్ లో అన్ని రకాల కార్యక్రమాలకు వీటిని వినియోగించుకోవచ్చని సూచించారు. రైతులకు మేలు చేసేందుకే రైతు వేదికలు నిర్మిస్తున్నామని, సాగుకు సంబంధించిన, సమగ్ర సమాచారం, అందులో అందుబాటులు ఉంటుందని తెలిపారు. 2014 కు ముందు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే వారు కాదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంటరి మహిళ తో పాటు, ఆసరా పింఛన్, వికలాంగుల పింఛన్, ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని, కరోనా సమయంలో ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ముఖ్యమంత్రి రైతులను భరోసా ఇవ్వడానికి రైతు బంధును వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా రైతు మరణించినట్లయితే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా వారి కుటుంబానికి 5 లక్షల రైతు బీమా లభించే విధంగా రైతు బీమా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి రైతులపై బీమా చేయించడం జరిగిందన్నారు.  రైతుల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా దేశంలో మరేక్కడాలేవన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్  కోరం కనకయ్య, జిల్లా డిసిసిబి చైర్మన్  కురాకుల నాగభూషణం, ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్, మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తెరాస  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్లం వెంకట్రావు, జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పోడి యం ముత్యాలమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ కొమరం రాంబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పినపాక నియోజకవర్గంలోని ఐదు  మండలాల వారీగా   అధికార ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, తెరాస అధికార ప్రతినిధులు , నాయకులు , కార్యకర్తలు , రైతులు పాల్గొనున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :