కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందిన దళితులకు 3 ఎకరాల భూమితోపాటు రైతులకు మంగళవారం తొమ్మిది మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ పరికరాలు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు గన్నేరువరం మండలం లోని చొక్కారావుపల్లె గ్రామం నుండి ఏడుగురు మరియు మాదాపూర్ నుండి ఇద్దర్నీ పూర్తిగా భూమి లేని వారిని గుర్తించినట్లు ఏవో కిరణ్మయి తెలిపారు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మాట్లాడుతూ దళితులకు పూర్తిగా భూమి లేని మహిళలను ఎంపిక చేసి వారి కి ప్రభుత్వం ఉచితంగా భూమి ఇచ్చి పెట్టుబడి సాయం కింద విత్తనాలు ఎరువులు పురుగుల మందులు మరియు టర్పలిన్, స్పియర్ లను కూడా ప్రభుత్వమే అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏవో కిరణ్మయి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న -సుధాకర్, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ గొల్లపెల్లి రవి, ఏఈఓ ప్రశాంత్, మరియు రైతులు పాల్గొన్నారు