కరోనా వైరస్ నియంత్రణపై తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తోన్న ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.కరోనా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 14తో ముగుస్తుంది. దీంతో ఏపీలో లాక్డౌన్పై ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయంపై కూడా జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.