పల్నాడు : మాచర్ల మండల పరిధిలోని నాగార్జున సాగర్ కుడి కాలువ కు చెందిన మల్లవరం మేజర్ , దిబ్బయ్య మేజర్ లకు నీరు వదిలి జమ్మలమడక , కంభం పాడు గ్రామాల పరిధిలోని వరి పంట కు సాగు నీరు ఈ నెల చివరి వరకు ఇవ్వాలి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుమ్మడి కోటేశ్వరరావు యాదవ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ డ్యాం నుంచి బుగ్గవాగు రిజర్వాయర్ వరకు ఉన్న మేజర్ కాలువలకు సాగు నీరు విడుదల చేసి వరి పంట ను కాపాడాలని ,లేకుంటే వందల హెక్టార్ల లలోని వరి పంట కు నష్టం వాటిల్లి రైతులు ఆర్దికంగా చితికి ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితులు నెలకొంటాయి అని కావున ప్రభుత్వం మేలుకొని సాగు నీరు అందించాలని బిజెపి విజ్ఞప్తి చేస్తుంది.
బిజెపి నాయకులతో కలిసి పంటపొలాలను పరిశీలించి రైతులసమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ పర్యటనలో మాచెర్ల అసెంబ్లీ కన్వీనర్ గుమ్మడి నాసర య్య , మాచెర్ల పట్టణ అధ్యక్షులు ఓర్స్ క్రాంతి కుమార్ , జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ టంగు టురి సాయి శర్మ పాల్గొన్నారు.