నెల్లూరు జిల్లా: మధ్యాహ్నం 3 గం” లకు సర్ సివిరామన్ సెమినార్ హాల్ నందు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సమావేశ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్. ఎల్.విజయ క్రిష్ణ రెడ్డి గారు, మాట్లాడుతూ అందరూ యూనివర్శిటీ అభివృద్ధి కొరకు కృషి చేయాలని అదేవిధంగా ఉద్యోగులకు ఎల్లవేళల సహాయ సహకారాలు ఉంటాయని వారికి రావాల్సిన ప్రయోజనాల ను తప్పకుండా ఇప్పించడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తానాని, విశ్వవిద్యాలయానికి పేరు ప్రఖ్యాతలు తీసుకోవచ్చే విధంగా ఉద్యోగులు అందరూ కృషి చేయాలని తెలిపారు.తదనంతరం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో వి ఎస్ యూ
నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్
ప్రెసిడెంట్ కె.విద్యా సాగర్,వైస్ ప్రెసిడెంట్ మస్థానమ్మ,సెకరెటరీ కలీమ్,ట్రెజరర్ రబ్బానీ,జాయింట్ సెకెరెటరీ సీతమ్మ ఈసీ మెంబర్లు స్రవంతి,మస్తాన్ బాషా,బాలు,ధనుంజయ,ఉస్మాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.