తెలంగాణ రాష్ట్రం లో కరోనా రోజువారీ కేసుల్లో తగ్గుదల నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కరోనా వ్యాప్తి నిదానించింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 436 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం అని చెప్పాలి. ఇతర జిల్లాల్లో చూస్తే అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 12 పాజిటివ్ కేసులను గుర్తించారు.అదే సమయంలో 3,837 మంది కోలుకోగా, 21 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,74,026 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,33,862 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 36,917 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,247కి చేరింది. రాష్ట్రం మొత్తమ్మీద రికవరీ రేటు 93 శాతానికి పెరిగింది.