హెచ్ఎండీఏ (హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ )పరిధిలోని మున్సిపాలిటీల్లో కొత్త పార్కులు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివార్లలో ప్రకృతి అందాల పలకరింత, ఆహ్లాదానికి నిలయంగా పార్కులను తీర్చిదిద్దాలన్న మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ అర్బన్‌ఫారెస్ట్రీ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలను చూపిస్తే పచ్చని అందాలతో కళకళలాడేలా పార్కులను అందిస్తామంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. ఇం దులో భాగంగా బోడుప్పల్, బడంగ్‌పేట, మీర్‌పేట, జిల్లెలగూడ, ఫిర్జాదిగూడ, మేడ్చల్, షాద్‌నగర్, శంషాబాద్‌లలో పార్కుల అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. వాకర్ జోన్, కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా ఈ పార్కుల్లో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఏడు చోట్లలో ఐదు చోట్ల పనులు పురోగతిలో ఉండగా బోడుప్పల్, బడంగ్‌పేటలో పార్కులు ప్రారంభానికి సిద్ధ్దంగా ఉన్నాయి. ఎన్నికలు ముగియగానే ఈ పార్కులను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. ఖాళీస్థలాలు చూపిస్తే మరిన్ని పార్కులను సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )