అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఉన్న ఒక వ్యోమగామికి మెడ నరంలో రక్తం గడ్డకట్టింది. అతడు తిరిగి రావడం కుదరదు. ఇది చిన్న సమస్యేనని, చికిత్స చేస్తే సరిపోతుందని వైద్యులు చెప్పారు. అయితే డాక్టర్లను ఐఎస్ఎస్కు పంపి సర్జరీ చేయించే సదుపాయాలు లేవు. దీంతో ఇలాంటి వ్యవహారాల్లో నిపుణుడైన నార్త్ కాలిఫోర్నియా వర్సిటీ వైద్యుడు స్టీఫెన్ మోల్ వైద్యుడు రంగంలోకి దిగాడు. ఈమెయిళ్లు, రిపోర్టులు, ఫోన్ సంభాషణల సాయంతో ఇద్దరూ సంభాషించుకున్నారు. 3 నెలల పాటు చికిత్స సాగింది.అతడు భూమిమీద నుంచి ఆ వ్యోమగామి ఆరోగ్య పరిస్థితిని గమనించాడు. అతనికి సలహాలు సూచనలు అందించాడు. ఐఎస్ఎస్లోని మెడికల్ కిట్లో ఇనోక్సపరిన్ అనే కెమికల్ ఉంది. అది గడ్డకట్టిన రక్తాన్ని పల్చబారుస్తుంది. అయితే ఎంత డోసును, ఎలా ఇంజెక్ట్ చేసుకోవాలి తెలుసుకోవాలి. స్టీఫెన్ మోల్.. ఆ వ్యోమగామికి మెడలో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడం ఎలాగో నేర్పించాడు. అతని సూచనలన్నీ పాటించాడు వ్యోమగామి. కొన్ని మాత్రలు కూడా మింగాడు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference