కరీంనగర్ జిల్లా మంగళవారం అర్ధరాత్రి గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లె బిక్కు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు అలాగే బుధవారం తెల్లవారుజామున తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పికప్ వాహనాన్ని గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో పట్టుకొని సీజ్ చేసి రెండిటిని మైనింగ్ డిపార్ట్మెంట్ కి పంపినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు ఇకపై అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు