contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్రిడిటేషన్ లేదని అదైర్యపడకండీ – త్వరలో ఒక వేదిక ఏర్పాటు చేయబోతున్నా : అధ్యక్షులు – ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ( PEMRAINDIA )

V.SUDHAKAR NATIONAL PRESIDENT – PRINT & ELECTRONIC MEDIA REPORTERS ASSOCIATION – INDIA 
అక్రిడిటేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అనికొందరుఅక్రిడిటేషన్ పోందినవారు,కోందరు రూపాయలుపొసి కొన్నవారు.అక్రమంగా ఇప్పించిన మధ్య దళారులు డబ్బులు పుచ్చుకుని అనధికారికంగా అక్రిడేషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారుల్లారా…. తస్మాత్ జాగ్రత్త,ఓ జిల్లాలో మరొక జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మొదటి విడతగా అక్రిడేషన్ లుపొంది రెండవ విడతగా మరికొందరిని ఎవరైతే వర్కింగ్  జర్నలిస్టులో వారికి అక్రిడిషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది…కానీ…కానీ…ఇక్కడ ఒక తిరకాసుంది అక్రిడిటేషన్ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారు ఏ యూనియన్ కీ అనుబంధంగా పని చేస్తున్నారో ఆ యూనియన్ కి అనుబంధంగా ఉన్న వారికి మాత్రమే అక్రిడిటేషన్ లూ ఇప్పిస్తున్నారు. అక్రిడిటేషన్ రాని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కమిటీ మెంబర్లను ప్రశ్నిస్తే మీరు మా యూనియనా మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని వ్యగ్యంగా  సమాదానమిస్తున్నారని సమాచారం. ఓ జిల్లాలో చిన్నా చితకా పత్రికల్లో పనిచేసే వ్యక్తులందరూ రెండు వందల యాభై మందికి పైగానే వర్కింగ్ జర్నలిస్టులున్నారు. పౌర సంబంధాల శాఖ వారి వద్ద ఉన్న లిస్టు నలభై నుంచి అరవై మంది వరకే ఉంటుంది,  ప్రభుత్వ కార్యకలాపాల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించే గొంతుకలు ఈ రోజు అక్రిడిటేషన్ పొందలేకపోతున్నారు.  అసలైన వర్కింగ్ జర్నలిస్టుల పేర్లు పౌర సంబంధాల శాఖ వారి వద్ద ఉండవు అనధికారికంగా డబ్బులు పోసి అక్రిడిటేషన్ పొందినవారిలిస్థ్ ఉంటుంది.అలాంటి వారు ప్రెస్మీట్లకు హాజరు కారు’ అసలు వాళ్లు జర్నలిస్టులని ఎవరికి తెలీదు    అలాంటి వారి లిస్టు కావాలని ఆర్టీఐ కింద సమాచారం కోరితే ఓ జిల్లాలోని పౌర సంబంధాల శాఖ అధికారులు లిస్టు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటి..? ఇక్కడే మనకు అర్థమవుతుంది డబ్బులు తీసుకుని అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారని..! ఇదంతా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల కనుసన్నల్లో ఆయా జిల్లాల డిపిఆర్ఓలు కొందరు  తలవంచివారు చెప్పినవారికే అక్రిడిటేషన్లు ఇచ్చారని అనేక జిల్లాల నుండి ఆరోపణలు వస్తున్నాయి. జర్నలిస్టులకు జర్నలిస్టులే శత్రువులా..? లేక ఆయా యూనియన్ లోఉన్న వారినే ఆదరిస్తున్నారా..? అదినిజమని తెలుస్తుంది.? అలాంటి వాళ్లు జర్నలిజం వృత్తిలో ఉండడమేమిటి.? సమాజం తలదించుకునే విధంగా తోటి జర్నలిస్టులకు తమవంతు సహాయం చేయలేనివారు వారెలా జర్నలిస్ట్ లౌతారు.? పూట గడవని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు డబ్బులిచ్చి అక్రిడిటేషన్ కార్డు కొనుక్కునేంత స్తోమత ఉందా ? లేదని తెలుసు అయినా కానీ వారిని చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అక్రిడిటేషన్ రాని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారూ. ఆంధ్రా, తెలంగాణలోని  డిపిఆర్వో లనుండి సమాచారం సేకరించే పనిలో పడ్డామని తెలియజేస్తున్నాము. ఈ ఆరు ఏళ్ల నుండి ఎవరెవరికి అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారు ఎంతమంది అర్హులు, ఎంతమంది వర్కింగ్ జర్నలిస్టులు, అనే సమాచారాన్ని మేము సేకరిస్తున్నామని తెలియజేస్తున్నాము. తీగ లాగితే డొంక కదిలినట్టు ఆయా జిల్లాల్లోని డీపీఆర్ఓల, అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ల చరిత్ర బయటికి రానుంది, పేద జర్నలిస్టులను ఆదుకోవాల్సింది పోయి యూనియన్ల పేర్లు చెప్పి పేద జర్నలిస్టులను అణగదొక్కుతున్న వారి అంతు చూస్తాం,  అక్రిడిటేషన్ అమ్ముకున్న వారిని కోర్టుకీడుస్తాం వారికి శిక్ష పడేంత వరకూ పోరాటం చేద్దాం రండి, కదిలిరండి, ప్రజలను ప్రక్క తోవ పట్టించి… అక్రిడిటేషన్ లు లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా  మాట్లాడుతున్నారట.వీరికి నా ప్రశ్న.  చక్కగా క్లుప్తంగా సంప్రదాయంగా  మాట్లాడలేని వారు ఎదుటి వ్యక్తుల్ని విమర్శిస్తే తస్మాత్ జాగ్రత్త, 
అక్రిడిటేషన్స్ కలిగిన జర్నలిస్ట్ ల్లారా…అక్రిడిటేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా… ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి? మీకూ తెలిస్తే.? ప్రభుత్వ అదికారులకంటే మీరు  గొప్పవారా…? వారికి లేని అభ్యంతరం మీకు ఎందుకు…?
పేపర్… ఛానల్ లకు ఇన్ని అక్రిడిటేషన్స్ ఇవ్వాలి అని లిమిట్ ఉంటుంది. మరి అక్రిడిటిషన్స్ లేనివారందరు రిపోర్టర్స్ కారా…?
మాదేపెత్తనం నడవాలని కొందరు    నకిలీ రిపోర్టర్స్ అని అసత్యప్రచారం చెస్తున్నారు.  రిపోర్టర్ లని సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? మీరు వర్కింగ్ జర్నలిస్ట్ లు కాకున్నా డబ్బులు తీసుకొని అక్రిడిటేషన్ లు ఇప్పించినవారే అసలైన నకిలీ విలేకరులని ఈ సందర్భంగా ఘంటాపదంగా చెప్పక తప్పదు.
 అక్రిడియేషన్స్ లేనివారు పెట్టింది వార్త కావడం లేదా…? 
మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు  గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు…?వారికి లేని బాధ మీకెందుకు…?
అసలు అక్రిడిటేషన్ అంటే ఏంటో… సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి..? 
 మీ దమ్ము అన్నది మీ వార్తలో చూపించండి. మీ దగ్గర ఉన్న ఎన్నో ఇల్లిగల్ పనులు జరుగుతున్నాయి, వాటిని భయటపెట్టండి.రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి. మీ ప్రతాపాలు తోటి రిపోర్టర్స్ పైన కాకుండా అవినీతి పైన చూపించండి. మనలో మనకు ఐక్యత లేకనే రిపోర్టర్ అంటే సాయంత్రం ఇంత తాగిస్తే సరిపోతుంది, ఎం చెప్పినా వింటాడు.. బ్లాక్ మెయిల్ చేస్తాడు.. ప్రజలను మోసం చేస్తాడు అనే నిందను దూరం చేయండి.అక్రిడిటేషన్స్ ఉన్నా లేకపోయినా పెట్టే వార్తలో దమ్ము ఉండాలి.
ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ స్థాపించి,ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు వస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు?
దయఉంచి గమనించండి.. ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది పనిచేస్తారు కానీ నిర్దేశిత ప్రకారం కొన్ని అక్రెడిటేషన్ కార్డులను మాత్రమే మంజూరు చేయపడుతుంది.. మిగిలిన రిపోర్టర్స్ అందరూ నకిలీ నా?
కొంచం రాగద్వేషాలు లేకుండా అన్ని చోట్లా  ఒకరినొకరు మనమే కలుపుకొని ఐకమత్యంగా నిలబడదాం.
ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే అస్సలు అక్రెడిటేషన్ అనే నిబంధనలు తెచ్చేది అధికారులు, పోలీస్ వారు కాదు. మనలోవారే, వారికి ఆ ఆలోచనలను కలుగజేసేది. ముందు మన రిపోర్టర్స్ మారాలి. నిజంగా చానెల్స్, పేపర్లు, టెలికాస్ట్ ఉన్నాయా లేదా ? అని ఆలోచన మన రిపోర్టర్ లకె తెలియాలి అది తెలియనివారు అనేకం , కొందరికి జర్నలిజంలో ఎలా మెదలాలో తెలియని వారుకూడా జర్నలిస్ట్ గా చెలామని కావడం విచారించ దగ్గ  విషయం. దీంతో అసలైన  జర్నలిస్ట్ లకు కూడా చెడ్డ పెరు రావడం బాదాకరం. కాబట్టి మిత్రులారా తోటి జర్నలిస్ట్ నూ జర్నలిస్ట్ గా మర్యాద పూర్వకంగా నీవు  చూడకపోతే నీ నీడను నీవే చూసి జడుసుకునే రోజులు నీ వేంటే తిరుగుతూనే ఉంటాయి .  ఈ సందర్భంగా అక్రిడిటేషన్ రాని వర్కింగ్ జర్నలిస్ట్ లకోసం త్వరలో ఒక వేదిక  ఏర్పాటు చేయబోతున్నామని తెలియచెయడానికి సంతోషిస్తున్నాం.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :