సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో మంగళవారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల పేరిట గ్రామాన్ని సందర్శించి బేగంపేట్ లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండా అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనగం శంకర్ మాట్లాడుతూ రసమయి బాలకిషన్ బేగంపేట సభలో మాట్లాడినటువంటి అవాస్తవాలను ఖండిస్తూ ఎమ్మెల్యే బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా బేగంపేట అభివృద్ధి జరిగిందా లేదా! నీ పక్కన నీ స్టేజిపై కూర్చున్నటువంటి వాళ్లని అడగండి స్వయంగా బేగంపేట స్కూల్ ను సందర్శించినప్పుడు నీ పక్కన ఉన్న పెద్దమనిషి ఈ నాలుగు రూములు నేను కట్టించాను అని మీతో చెప్పాడు, ఆ పెద్దమనిషి ఏ పార్టీలో ఉన్నాడు మీకు తెలియదా! వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం పార్టీలు మారినటువంటి వాళ్లను నీ పక్కన కూర్చుండ పెట్టుకొని భజన చేయించుకుంటున్నావు, మహిళా భవనానికి రంగులేసినంత మాత్రాన నువ్వు నిర్మించినట్ట, పాత ట్యాంకులకు రంగులు పూయడం ఇవన్నీ ప్రజలు గమనిస్తా లేరని నువ్వు అనుకుంటే నీ అజ్ఞానమే! అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఆ విగ్రహ నిర్మాణం కోసం అప్పుడు అన్ని పార్టీల వారు సహకరించారనె సత్యాన్ని నీ భజన మండలినీ అడుగు, ఏదో నీ అధికార బలం తోటి బేగంపేటలో సభను సక్సెస్ చేసుకున్నా అని సంబరపడుతున్నావు ప్రజలు అంతా గమనిస్తున్నారు,బేగంపేట మండలాన్ని అడ్డుకున్నది మీరు కాదా? గ్రామపంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా బేగంపేట ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా సిద్దిపేటలో కలుపుకున్నది మీరు కాదా? రానున్న ఎన్నికలలో బెజ్జంకి మండల ప్రజలు బలవంతంగా సిద్దిపేటలో కలిపినందుకు నీకు తగిన గుణపాఠం చెబుతారు. అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సోమ రాంరెడ్డి ,బేగంపేట మాజీ సర్పంచ్ బుర్ర అంజయ్య గౌడ్, కొరివి లచ్చయ్య, పున్నం రాజేశం, నూనె రాజేందర్, మేకల కనకయ్య, బర్ల శంకర్, బుర్ర సత్తయ్య, శీలం నర్సయ్య, కొరివి సంపత్, రాజు రవి, కొమ్ము కోటి, బర్ల బాబు, కొరివి మల్లయ్య, బర్ల కొమురయ్య,
జతనం అంజయ్య,బుర్ర మురళి, కొరివి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.