(ఊహా చిత్రం)
అమరావతి లోని మందడం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రిYS జగన్ నేడు సచివాలయానికి వస్తుండటంతో గ్రామంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ధర్నాలు, నిరసనలకు అనుమతి నిరాకరించారు. మెయిన్ సెంటర్‌తో పాటు గల్లీల్లో ఉన్న షాపులను సైతం పోలీసులు మూయించేస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోనివ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి స్పందించిన పోలీసు అధికారులు మధ్యాహ్నం తర్వాత అనుమతి విషయంపై ఆలోచిస్తామంటూ సమాధానం ఇచ్చారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference