అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మిన్నెయాపోలిస్ నగరంలో గుర్తుతెలియని దుండగుడు పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారిన దృశ్యాలు ఫేస్‌బుక్ లైవ్‌లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఇంకా పట్టుబడలేదని, ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.