ఏపీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు హఠాన్మరణం చెందారు. తనకు ఆయాసంగా ఉందని కుటుంబసభ్యులకు చెపుతూనే ఆయన కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా…. మార్గమధ్యంలో కారులోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణ వార్తతో అందరూ ఆవేదనలో మునిగిపోయారు. అయితే, కరోనా కారణంగా ఆయన చనిపోయి ఉండొచ్చనే అనుమానాలతో మృతదేహం వద్దకు వెళ్లేందుకు బంధువులు సాహసించడం లేదు. ఆదిరాజుకు మంచి నేతగా పార్టీ అధిష్ఠానం వద్ద గుర్తింపు ఉంది. విజయనగరం జిల్లాలో పార్టీకి మళ్లీ జీవం పోసే ప్రయత్నం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణకు నమ్మినబంటుగా ఆయన ఉండేవారు.