కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఆత్మ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన పథకంపై చీమలకుంటపల్లి గ్రామంలో శిక్షణా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృషి విజ్ఞాన కేంద్ర జమ్మికుంట సైంటిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతూ పత్తిలో రసం పీల్చే పురుగులు నివారణ చర్యలు మరియు ఎరువుల వాడకం గురించి అవగాహన కల్పించారు రసం పీల్చే పురుగులు నివారణ చర్యల్లో భాగంగా కాండం కి బొట్టు పెట్టే పద్ధతి ద్వారా సమర్థవంతంగా మరియు తక్కువ ఖర్చుతో తక్కువ రసాయనిక మందులు వాడడంతో నివారించవచ్చు అని తెలియజేశారు. బొట్టు పెట్టే పద్ధతి కి అవసరమయ్యే Stem applicator ఆత్మ ఆధ్వర్యంలో పంచడం జరిగింది ఇంకా వరిలో వచ్చే చీడపీడల గురించి మరియు ఎరువుల వాడకం బయో ఫెర్టిలైజర్స్ వాడకంపై శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో చీమలకుంటపల్లి సర్పంచ్ కర్ర రేఖ,పిడి ఆత్మ ప్రియదర్శిని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కిరణ్మయి,బిటిన్ ఆత్మ సునీల్, ఏఈవో నరేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు