శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ‘నెమలి’ ఒకటిగా కనిపిస్తుంది. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. శ్రీకృష్ణుడికి నెమలి అంతే ఎంతో ప్రీతి .. ఈ కారణంగానే ఆయన తన శిరస్సున నెమలి ఈకను ధరించేవాడు. అలా తనకి ఎంతో ఇష్టమైన నెమలి పేరుతో ఏర్పడిన గ్రామంలోనే స్వామి ఆవిర్భవించడం విశేషం.
స్వామివారిని దర్శించడం వలన, ఆపదలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ధర్మబద్ధమైన కోరికలు స్వామివారి అనుగ్రహంతో తొలగిపోతాయని అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. ఆయన మహిమలను గురించిన సంఘటనలు ఇక్కడ కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఈ నెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ స్వామివారి బ్రహ్మోత్సవం వైభవంగా జరుగుతుంది. 9వ తేదీ రాత్రి జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. స్వామివారికి కట్నకానుకలు మొక్కుబడులు చెల్లించుకుంటారు.