భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజధాని నగరం అయిన కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని లోని ఇందిరా ప్రియదర్శిని నగర్ కి చెందిన యువతి హైదరాబాద్ నుండి గత గురువారం (4/6/2020) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిపో కి చెందిన TS28Z 0038 ఇంద్ర బస్సులో మధ్యాహ్నం 3:30 గంటలకు కొత్తగూడెం చేరుకుంది. సదరు యువతి హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ లో స్టాఫ్ నర్శ్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. యువతికి రెండు రోజుల నుండి జ్వరం, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపించడంతో అనుమానంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా సదరు మహిళకు కరోనా పరీక్షలు చేయగా శనివారం కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే సదరు యువతి ఆర్టీసీ బస్సులో వచ్చినందున తనతో పాటు గురువారం బస్సులో ప్రయాణించిన అందరూ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కాగా యువతి కుటుంబంతో 38 మంది కాంట్రాక్ట్ కేసులు గుర్తించినట్లు వారందర్నీ హోమ్ క్వరంటైన్ చేసి ఇంటింటి సర్వే ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ MV రెడ్డి వెల్లడించారు.