దేవనకొండకు చెందిన ఆర్మీ జవాన్ లక్ష్మన్నపై లాక్ డౌన్ సాకుతో యస్. ఐ మారుతి, కానిస్టేబుల్స్ అశోక్, మంజునాథ్ లు దాడిచేసి, ముఖంపై పిడిగుద్దులు గుద్ది రక్త గాయాలు చేసిన విషయమై, కర్నూలు డ్యూటీ డాక్టర్ MLC సమాచారం తరువాత కూడా పోలీసులు అతని స్టేట్మెంట్ తీసుకొని, FIR నమోదు చేయకపోవడాన్ని ‘మానవ హక్కుల వేదిక ‘ తీవ్రంగా ఖండిస్తోంది.
బాధిత జవాన్ లక్ష్మన్న అదే రోజు జిల్లా యస్పి గారికి ఫిర్యాదు చేయగా, “తాను సంభందిత అధికారులతో విచారణ జరపమని ఆదేశించా నని” చెప్పారు. బాధితుడి విషయమై కర్నూలు GGH ఆసుపత్రి డ్యూటీడాక్టర్ MLC సమాచారం ఇచ్చి రెండు వారాలు గడచినా, పోలీసులు అతని స్టేట్మెంట్ రికార్డు చేసి FIR నమోదు
చేయకపోవడం చూస్తే వారు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు?
భాదితుడు తానే ఫిర్యాదు రాసుకొని పత్తికొండ సి.ఐ చుట్టూ అనేకసార్లు కలసినా, ఆయన స్పందించక పోవడం చూస్తే, జిల్లా ఎస్.పి గారు ఎవరికి, ఏమని ఆదేశించారో? అర్ధం కావడం లేదు. దేశరక్షణ కొరకు సేవలు అందించే జవాన్ పట్లనే ఈవిధంగా ప్రవర్తిస్తే, ఇక సామాన్య ప్రజల పట్ల వీరు ఏవిధంగా ప్రవర్తిస్తారో? నని ఆందోళన ప్రజల్లో వ్యక్తమవు తొంది.
పోలీసులు “వేరే ఎవరి మీద నైనా ఇదేవిధంగా ఆరోపణలు వస్తే కాలయాపన చేయకుండా, వెంటనే భాదితుడి స్టేట్మెంట్ రికార్డు చేసి FIR నమోదు చేయరా? చేస్తారు. మరి ఇక్కడ నిందితులు పోలీసులు కాబట్టే, ఇంతవరకు ఉన్నత అధికారులు తమను ఆదేశించలేదని డోన్ DSP, పత్తికొండ CI సాకులు చెప్పడం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం కాదా?
భాదితుడి తరపున మాజీ ఆర్మీ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు పేరయ్య గారు యస్ పి గారికి నిందితులైన ఎస్. ఐ మారుతి, కానిస్టేబుల్స్ అశోక్,మంజునాథ్ లను సస్పెండ్ చేసి, వారిపై చట్టం
ప్రకారం చర్య తీసుకొనమని కోరినా స్పందిచక పోవడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?
కావున ఇప్పటికైనా ఆర్మీ జవాన్ లక్ష్మన్నపై దాడికి పాల్పడిన ఎస్ఐ ని V.R (VACANCY RESERVE) కు పంపడంతో సరిపెట్టుకుండా, అతనితోపాటు, ఇద్దరు కానిస్టేబుల్స్ ను ఉద్యోగంలో కొనసాగించడంలో అర్ధం లేదు. వారిని వెంటనే సస్పెండ్ చేసి, ఆర్మీ జవాన్ ఫిర్యాదును నమోదు చేయకపోతే, మాజీ జవాన్ & జవాన్లు ఆందోళన చేసే అవకాశం ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం , పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిందితులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.