మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ హావల్దార్ పల్లె శ్రీకాంత్ రెడ్డి ఇటీవల బెంగళూరు లో విధి నిర్వహణలో గుండెపోటు తో మృతి చెందారు. వారి కుటుంబానికి జయహో జనతా జవాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభ్యులు 30000 రూపాయలు తక్షణ సహాయం కింద అందించారు. ఇకముందు కూడా వారి కుటుంబానికి ఎటువంటి సహాయమైన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిన హావల్దార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున, కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న విధంగా ఆదుకోవాలని కోరారు. జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణ రెడ్డి, సెస్ డైరెక్టర్ ఐలయ్య యాదవ్ లు శ్రీకాంత్ రెడ్డి దినకర్మ లో పాల్గొని నివాళులు అర్పించారు. సహాయం అందించిన వారిలో ఆర్మీ జవానులు నవీన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.