ఆర్ ఆర్ ఆర్ మూవీకి నిర్మాత పేరుకు దానయ్య అయినా ఈ మూవీకి ఫైనాన్స్ చేస్తున్న బడా వ్యక్తులు అంతా రాజమౌళి ఇస్తున్న హామీల వలనే అంటున్నారు. ఈ వ్యవహారాలూ అన్నీ రాజమౌళి తాను డైరెక్ట్ గా కాకుండా కొడుకు కార్తికేయ నేతృత్వంలో జరుగుతున్న నేపధ్యంలో ఈ విషయాలు అన్నిటికి నిర్మాత దానయ్య కేవలం సాక్షిగానే మారుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మార్కెట్ మొదలు పెడితే కొస్తా ఆంద్ర నుండి ఈ మూవీని 100 కోట్లకు కొనుక్కుంటాము అని బడా ఆఫర్లు వస్తున్నా రాజమౌళి ఆ విషయాలను పక్కకు పెట్టి ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలను అన్నింటిని అన్నీ తానై చూసుకుంటున్నాడు అని టాక్. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ లాభాలలో ఎక్కువ శాతం వాటా తనకు వచ్చే విధంగా రాజమౌళి ప్లాన్ చేసుకుని నిర్మాత దానయ్యకు కేవలం తక్కువ వాటా తో సరిపెడుతున్నాడు అంటూ గాసిప్పులు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు 1000 కోట్ల బిజినెస్ జరిగేలా జక్కన్న రచిస్తున్న వ్యూహాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. దీనితో ఈ మూవీ బిజినెస్ 1000 కోట్ల మేరకు జరిగితే కలక్షన్స్ ఏ రేంజ్ లో రావాలి అన్న విషయం అర్ధంకాని సమస్యగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి..
