కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లె గ్రామ శివారు లోని బిక్క వాగు నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న పొత్తూరు కి చెందిన రెండు ట్రాక్టర్ లు, గన్నేరువరం కి చెందిన ఒకటి ట్రాక్టర్ ను పట్టుకుని మైనింగ్ శాఖ కు అప్పగించినట్లు గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు ఎస్సై మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు