ఏ నిర్మాత కూడా తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డైరెక్ట్ గా స్పందించకపోయినా, తన మనసులోని మాటను బయటపెట్టారు. సినిమా బిజినెస్ లో ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేం. కరోనా కారణంగా ఎగ్జిబిటర్స్ ఎంతో నష్టపోయారు. అదే సమయంలో నిర్మాతలూ దెబ్బతిన్నారు. కాబట్టి సినిమాల విడుదల విషయంలో ఎవరి నిర్ణయం వారు స్వతంత్రంగా తీసుకోవాలి” అని సురేశ్ బాబు అన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా ఎగ్జిబిటర్స్ తమ డిమాండ్లను ప్రభుత్వాలు పరిశీలించే వరకూ తెరిచేది లేదని అంటున్నారు. అయితే… ఈ నెలాఖరుకు థియేటర్లు ఓపెన్ కావచ్చునని కొందరు చెబుతున్నారని సురేష్ బాబు తెలిపారు.