2019 ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలువడంతో ఈ ఏడాది ముంబైలో ఆరంభ మ్యాచ్‌ను, ఫైనల్‌ను నిర్వహిస్తారు. మొత్తం 57 రోజుల పాటు టోర్నీ జరగనుంది.ఇక పోతే శని, ఆదివారాల్లో ఇప్పటి వరకు రోజుకు రెండు మ్యాచ్ లను నిర్వహిస్తుండగా ఇప్పటి నుంచి రోజుకు ఒక మ్యాచ్ ను మాత్రమే నిర్వహించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు జరపనున్నారు. ఐపీఎల్ ప్రసాదదారు విన్నపం మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటి వరకూ 12 సీజన్లు పూర్తి చేసుకుంది. 2020 సీజన్‌లో 8 జట్లు పోటీపడనుండగా..
టోర్నీ లీగ్ దశలో ప్రతి జట్టూ రౌండ్ రాబిన్ పద్ధతిలో మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ క్రమంలో ప్రతి టీమ్ సొంతగడ్డపై ఏడు మ్యాచ్‌లు.. ప్రత్యర్థి సొంత మైదానాల్లో ఏడు మ్యాచ్‌ల్లో పోటీపడనుంది.సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ ఒక మ్యాచ్ జరగనుండగా.. ఆ మధ్యలో సెలవు రోజు ఏమైనా ఉంటే ఆరోజు రెండు మ్యాచ్‌ల్ని నిర్వహిస్తూ వచ్చారు.
ఇక శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్‌లు జరుగుతూ వచ్చాయి. కానీ తాజా ప్రతిపాదనతో వారాంతాల్లోనూ ఒక్క మ్యాచే నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు కూడా రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference